షార్ట్ వేసుకుందని ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళనివ్వలేదు…
చిన్న ఐడియాతో… పరీక్ష రాసి వచ్చింది….
=================
షార్ట్ వేసుకుందని ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించలేదు కాలేజీ సిబ్బంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిన్న ఐడియాతో .. పరీక్షా గదిలోకి వెళ్ళి ఎగ్జామ్ రాసి బయటకి వచ్చింది. అస్సోంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జూబ్లీ తాములి అనే విద్యార్ధిని అసోంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ ప్రవేశపరీక్ష రాసేందుకు వెళ్లింది. అయితే ఆమె షార్ట్ ధరించి ఉండడంతో పరీక్షా గదిలోకి అనుమతించలేదు. హాల్ టిక్కెట్ గైడ్ లైన్స్ లో షార్ట్ వేసుకురావొద్దని ఆమె ప్రశ్నించినా, కాలేజీ సిబ్బంది మాత్రం ససేమిరా అన్నారు. దీంతో ఆమె పరీక్షా కేంద్రం గేట్ బయట ఉన్న తన తండ్రికి జరిగిన విషయం చెప్పింది. ఆ వెంటనే ఆయన ఒక ప్యాంట్ కొందామని దుకాణానికి పరుగెత్తాడు. ఈలోగా పక్కనే ఫ్రెండ్స్ … ఓ చిన్న ఐడియా ఇచ్చారు. వెంటనే ఆమె కర్టయిన్ నడుము భాగం వరకు చుట్టుకుని వెళ్ళింది. దీంతో కాలేజీ సిబ్బంది ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఇక పరీక్ష రాసి వచ్చిన ఆమె… కాలేజీ సిబ్బంది తీరుపై మండిపడింది.
ఇవీ చదవండి..