మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా… ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో, మృత్యువు ఎలా కబళిస్తుందో ఊహించడం ఎవరితరం కాదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అన్నదానికి బెంగుళూరులో జరిగిన ఈ ఘటన ఓ నిదర్శనం. నగరంలోని బొమ్మన్ హళి నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి బుల్లెట్ పై ప్రీతమ్, అతని స్నేహితురాలు కృతిక వెళుతున్నాడు. అలా ఫ్లై ఓవర్ ఎక్కిన కాసేపటికి బుల్లెట్ ఆగిపోయింది. వారిద్దరూ బండి దిగి, బుల్లెట్ ను చెక్ చేస్తున్నారు. ఈలోగా ఇద్దరు కుర్రాళ్ళు అతిగా మద్యం సేవించి కారులో యమాస్పీడ్ గా వస్తున్నారు.
అదే స్పీడుతో బుల్లెట్ ను చెక్ చేసుకుంటున్న ప్రీతమ్, కృతికలను ఢీ కొట్టారు. అంతే.. 50 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైఓవర్ నుంచి కిందకి పడిపోయారు. ఈ ఘటనలో ఆ ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. కారు వేగానికి బుల్లెట్ తుక్కుతుక్కైంది. కారు కూడా ఫ్లై ఓవర్ సైడ్ అంచుమీదకు ఎక్కి ఆగింది. యాక్సిడెంట్ చేసిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ అమాయకులైన ఆ ఇద్దరు మాత్రం వీరి నిర్లక్ష్యానికి బలయ్యారు.
ఇవీ చదవండి..