రాజ్ కుంద్రాకు శిల్పా శెట్టి గుడ్ బై..?

  0
  455

  బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు డైవ‌ర్స్ ఇచ్చేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఆమె భర్త రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. కుంద్రా అరెస్టు స‌మ‌యంలో భ‌ర్త‌ను కాస్త వెన‌కేసుకున్న శిల్పా… ఇప్పుడు వెన‌క్కి త‌గ్గింది. ఈ విష‌యంపై ఎవ‌రైనా ప్ర‌శ్నించినా ఆచితూచి స్పందిస్తోంది.

  భర్త అరెస్ట్ కావడంతో ఆమె కొన్నిరోజులుగా సినిమా షూటింగులకు కూడా హాజరు కావడం లేదు. ఇక గ‌తంలో ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్ల‌ను కూడా కొన్ని కంపెనీలు ర‌ద్దు చేసుకున్నాయి. దీంతో మ‌రింత కుంగిపోయిన శిల్పా… ఇప్పుడిప్పుడే కోలుకుండా కెరీర్ పై దృష్టి పెడుతోంది. మ‌ళ్ళీ షూటింగుల‌కు హాజ‌ర‌వుతోంది.

  ఈ క్ర‌మంలో ‘నేను చాలా పెద్ద తప్పు చేశాను. తప్పులు చేయడం మానవ సహజం. కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులకు బాధ కలిగించేలా ఉండకూడదు. నేను చేసిన తప్పును సరి దిద్దుకుంటాను’ అని ఆమె పోస్టు చేశారు. ఈ పోస్టుతో శిల్పాశెట్టి.. భర్త రాజ్‌కుంద్రాకు త్వరలోనే విడాకులు ఇవ్వనుందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై ఆమె డైరెక్టుగా ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇంకా చేయ‌క‌పోయినా, పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. మొత్తానికి కుంద్రాకు విడాకులు ఇచ్చి, కెరీర్ పై దృష్టి పెట్టి.. పిల్ల‌ల‌తో క‌లిసి ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి విడాకుల‌ పుకార్ల‌పై శిల్పాశెట్టి స్పందించాల్సి వుంది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్