ప్రేమించడంలేదని అమ్మాయిని కాల్చేశాడు..పోలీసులు ఇలా చేశారు.

  0
  1115

  అమ్మాయి తనను ప్రేమించడంలేదని , ఒక ఉన్మాది నడిరోడ్లోనే కాల్చి చంపి పరారయ్యాడు.. పోలీసులు వెంటనే ఏమి చేశారో తెలుసా..? వాడి వేటకోసం ప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దించి , అరగంటలోనే , ఆ యువకుడి పక్కా ఇల్లు బుల్ డోజర్ తో కూల్చివేశారు.. మధ్యప్రదేశ్ లోని సాగర్ సిటీలో ఈ సంఘటన జరిగింది.. గతంలో ఉత్తరప్రదేశ్ లో పోలీసులను హతమార్చిన గూండాల ఇళ్ళను కూల్చివేసిన , తరహాలోనే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పోలీసు , అమ్మాయిలపై దారుణాలకు తెగపడే వారి ఇళ్లను కూల్చివేస్తున్నారు. పూనమ్ అనే ఈ యువతిపై నాలుగు నెలల క్రితం రోహిత్ రాజ్ ఫుట్ అనే ఈ యువకుడు దౌర్జన్యం చేసాడు. ఆ అమ్మాయి ఇంటిలోకి పోయి , తనను ప్రేమించాలని , పెళ్ళిచేసుకోవాలని వత్తిడి చేసాడు. అప్పట్లో పూనమ్ ఇచ్చిన పోలీసు కేసు ఆధారంగా , వాడిని జైలుకు పంపారు.. ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చి , పూనమ్ తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా , జైలుకు కూడా పంపిందన్న కక్షతో , నడిరోడ్లోనే పిస్టల్ తో కాల్చి చంపాడు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్