మనిషి నేరం చేస్తే అవయవాలు దానం చేయకూడదా..?

    0
    125

    తప్పు చేయడం మానవ సహజం. చిన్న తప్పులైతే ఎవరైనా క్షమించి వదిలేస్తారు. పెద్ద తప్పులయితో కోర్టు శిక్షలు అనుభవించక తప్పదు. అయితే అలాంటి తప్పు చేసి కోర్టు శిక్ష అనుభవించిన మనిషిలో మానవత్వం ఉండదా అంటే లేదని చెప్పలేం. అలాంటి ఓ వ్యక్తి స్వచ్ఛందంగా అవయవదానం చేయడానికి ముందుకొస్తే, నువ్వు నేరస్తుడివిని, నీకా అర్హత లేదని ఎవరైనా అడ్డుపడగలరా. కానీ కేరళలోని జీవన్ దాన్ ట్రస్ట్ మాత్రం అభ్యంతరం తెలిపింది. తన యజమాని వద్ద పని మానేసిన ఓ డ్రైవర్ కాలక్రమంలో జైలు జీవితం అనుభవించాడు. తన యజమానికి కిడ్నీలు చెడిపోయాయని తెలుసుకుని, ఆయనకు తన కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చాడు. అయితే నేరస్తుడు కిడ్నీ దానానికి పనికిరాడని తేల్చి చెప్పింది జీవన్ దాన్ ట్రస్ట్. దీంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.

    అవయవదానానికి కులం, మతం, నేర చరిత్ర అనేది చూడటం పెద్ద నేరం అని చెప్పింది కేరళ హైకోర్టు. నేరచరితుడు అన్న పేరుతో అడ్డుకున్న జీవన్ దాన్ ట్రస్ట్ కి చీవాట్లు పెట్టింది. అవయవాలు ఇచ్చే వ్యక్తి నేరస్తుడా, దొంగతనాలు చేశాడా, హత్యలు చేశాడా అనేది ముఖ్యం కాదని, మనిషి మనస్తత్వానికి తప్ప అవయవానికి నేరం ఉండదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి నేరస్తుడైనంత మాత్రాన, ఆ వ్యక్తిలోని కాలేయం, గుండె, ఊపిరితిత్తులు కూడా నేరం చేయవని చెప్పింది. రక్తం ఏ మనిషిలో ప్రవహించినా అది రక్తమేనని, దానికి జాతి, మతం, కులం.. ఆపాదించలేని అన్నది. అవయవదానానికి అడ్డంకులు తొలగించింది.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్