రాసలీలల ఎస్సై ని చితగ్గొట్టారు,

  0
  6441

  ఒక మహిళతో అక్రమ సంబంధం కేసులో , ఆ మహిళా భర్త చేతిలో చావు దెబ్బలు తిన్న వనపర్తి రూరల్ ఎస్సై షఫీని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ తరలించారు. పోలీసు అధికారులు అతడిని సస్పెండ్ చేసారు. కొత్తకోటలో ఒక మహిళతో షఫీ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త , భార్యను హెచ్చరించిన ఫలితంలేదు. ఎస్సైకి చెప్పిచూస్తే , అతడుకూడా వినలేదు.. నీ భార్య అంటే నా కిష్టం అంతే .. అంటూ యథేచ్ఛగా ప్రేమాయణం కొనసాగించాడు. అయితే ఎస్సైని , భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ చేసాడు. బెంగుళూరు పోతున్నానని భార్యకు చెప్పి , బ్యాగ్ తో , బయటకెళ్ళాడు.

  భర్త అలా బయటకెళ్లాడో లేదో , భార్య ఫోన్ చేసి ఎస్సైని రమ్మంది.. అంతే , గంటలో ఎస్సై దిగేసాడు.. ఇద్దరూ కలిసి తలుపులేసుకొని ప్రేమాయణంలో మునిగిపోయారు. అదను కోసం సమీపంలోనే మాటు వేసిన భర్త , అతడి స్నేహితులు , ఇంటికొచ్చి ఇద్దరినీ పట్టుకొని చితకబాదారు. ఎస్సైని , కింద పడేసి దారుణంగా కొట్టారు. చివరకు , తనను కొట్టవద్దంటూ దండంపెడుతున్నా , కాళ్లతో , చేతులతో , కర్రతో కుమ్మిపారేసారు. తరవాత ఎస్సైని పోలీసులు హాస్పిటల్ కి తరలించారు.. లోడెబ్బలు ఎక్కువకావడంతో హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించారు.. ఇంతలో అతడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.