ఇలాంటి తండ్రి బ్రతకకూడదు..అందుకే ఉరి శిక్ష వేస్తున్నా..

    0
    474

    మైనర్ కూతురిపై అత్యాచారానికి తండ్రి నాన్ హు ఖాన్ కి ఉరి శిఖ విధిస్తూ లక్నో జిల్లా కోర్టు జడ్జి నితిన్ పాండే తీర్పు చెప్పారు. బరియాక్ కు చెందిన నాన్ హు ఖాన్ 12 ఏళ్ళ కూతురిపై అత్యాచారం చేసాడు. ఎవరికైన చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల కూతురికి పెళ్లిచేసి , మళ్ళీ ఇంటికి పిలిపించాడు. భర్త దగ్గరకు పంపకుండా ఇంట్లోనే ఉంచుకొని రోజూ అత్యాచారం చేసేవాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానని భార్యను , కొడుకుని బెదిరించాడు. అయితే తండ్రి వేధింపులు భరించలేని కూతురు , ఈ విషయాన్నీ పోలీసు ఉన్నతాధికారికి వాట్సాప్ ద్వారా తెలిపింది. దీంతో వెంటనే పోలీసు రంగంలోకి దిగింది. చుట్టుపక్కల వారితోసహా , కుటుంబ సభ్యులు , మైనర్ కూతురు , తండ్రి నాన్ హు ఖాన్ చేసిన నీచమైన అకృత్యం గురించి చెప్పారు. కేసు విచారించిన న్యాయమూర్తి , మానవ సమాజంలో ఇలాంటి మనుషులు ఉండకూడదని అన్నారు. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే , ఇంతటి దారుణానికి పాల్పడితే , అతడు జీవించిఉండేందుకు అర్హుడుకాదని అన్నారు. ఇలాంటి మృగాలు , మనుషుల మధ్య ఉండకూడదని చెబుతూ ఉరిశిక్ష విధించారు..

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.