ప్రభాస్ ప్రేమలో పడ్డాడన్న మాట వాస్తవం కాదని , ప్రభాస్ పెద్దమ్మ , సీనియర్ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ కి ప్రేమలో పడేంత తీరికలేదని , ఒకవేళ ప్రేమపెళ్లి చేసుకోవాలనుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రభాస్ కు తీరికలేనంతగా సినిమాలు ఉండటంతో , పెళ్లి ఆలస్యం అవుతొందన్నారు. త్వరలోనే ప్రభాస్ పెళ్లిపై ఒక మాట చేపట్టామని అన్నారు.
తన పెదనాన్న , కృష్ణంరాజుతో , ప్రభాస్ అనుబంధం , ప్రేమ మాటల్లో చెప్పలేనంత మధురమని , అనుకుంటే కన్నీళ్లు వస్తాయన్నారు. చిరంజీవికి , ఉపాసన మంచి కోడలు అని అన్నారు. రామ్ చరణ్ , ఉపాసన లను చూస్తే తనకెంతో సంతోషంగా ఉంటుందని , అలాంటి కొడుకు , కోడలు ఉన్నందుకు చిరంజీవి అదృష్టవంతుడిని చెప్పారు. పూజాబేడి , అనుష్క ,.లతో ప్రభాస్ ప్రేమలేదు , దోమలేదు.. వాళ్ళు మంచి స్నేహితులు ..అంతే అనిచెప్పారు..