తల్లీ , కూతుళ్ళ దారుణ హత్యవెనుక ఘోరం బయటపడింది..

  0
  95192

  ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లీ కూతుళ్ళ దారుణ హత్య వెనుక మిస్టరీ ఒక కొలిక్కి వచ్చింది. బంగారం దొంగతనంకోసం హత్యలకు తెగబడే షోలాపూర్ ముఠా ఈ దారుణం వెనుక ఉందని తేల్చారు. ప్రకాశం జిల్లా పోలీసులు సమర్థవంతంగా , అత్యంత వేగంగా చేసిన దర్యాప్తులో ఈ సంచలన హత్యల వెనుక ముఠా చేసిన మోటారు దారుణం కూడా బయటపడింది. ప్రకాశం జిల్లాలోనే , ఒక వృద్ధురాలి చెవిలో కమ్మలకోసం , షోలాపూర్ ముఠా ఏకంగా , దంపతులను చంపేసి , చెవులు కోసి , కమ్మలు తీసుకెళ్లింది. అదే ముఠా ఇప్పుడు టంగుటూరులో బంగారు వ్యాపారస్తుల కుటుంబంలో , తల్లీ , కూతుళ్ళ గొంతులు కోసేసి ,20 సవర్ల దండలు , గాజులు తీసుకెళ్లింది. ఈ ముఠా కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు , టోల్ ప్లాజాల ను ట్రాక్ చేస్తూ పోగా , ఇది కిరాతక షోలాపూర్ ముఠా పనేనని గుర్తించారు. దీంతో షోలాపూర్ పోలీసులను అప్రమత్తం చేసి , ముఠాను పట్టుకున్నారు. వారిని తీసుకొచ్చేందుకు ఒంగోలు నుంచి ప్రత్యేక పోలీసు బృందం బయలుదేరింది..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.