నన్ను సీఎం , అందగత్తెవు అన్నాడు..అదే నాకు బాధగా ఉంది..

    0
    844

    బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ , నన్ను అందగత్తెవు ..అన్నాడు.. నాకు చాలా బాధేసింది.. మహిళలను ఇలా కించపరవడం న్యాయ్యమా అంటూ బీహార్ బిజెపి ఎమ్మెల్సీ నిక్కీ హెంబ్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్నే తమ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. గిరిజనుల సమస్యలపై , ముఖ్యమంత్రి అఖిలపక్షం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో గిరిజనుల్లో మద్యపానం అలవాటు మాన్పించాలని కోరారు. అయితే నిక్కీ ఏదో చెబుతుండగా , మీకు గిరిజనుల సమస్యలు తెలియదమ్మా.. నువ్వు అందంగా ఉంటావు ..అన్నాడని ఆమె చెబుతొంది. అయితే సీఎం నితీష్ అనుచరుల వాదన మరోలా ఉంది. గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తే , మద్యం నుంచి వాళ్ళను దూరం చేయవచ్చినని నిక్కీ చెప్పిందని , దానికి బ్యూటిఫుల్ అన్నాడని అంటున్నారు. ఆమె సలహా బ్యూటిఫుల్ గా ఉందని మాత్రమే అంటే , ఆమె దానిని మరోలా అర్ధం చేసుకున్నారని వాదిస్తున్నారు..

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.