సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..

    0
    646

    ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఇన్నాళ్లూ ఆయా పోస్ట్ లు పర్మినెంట్ అని చెప్పిన మంత్రులు, అధికారులు ఇప్పుడు మరింత క్లారిటీ ఇచ్చినట్టయింది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐఎఎస్‌లు సహా అన్ని విభాగాల ఉద్యోగులకూ మొదట్నుంచీ ఈ విధానమే అమలవుతోందన్నారు. గ్రామవార్డు సచివాలయాల్లో నియమితులైన వారిలో ఎవరి ఉద్యోగాలూ పోవని హామీ ఇచ్చారు. “ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకే పరీక్ష ఉంటుంది. పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్టు తప్ప మరో పరీక్ష ఉండదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ ఒక్కరి ఉద్యోగం పోదు.. ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదు” అని అన్నారు.
    ఆల్రడీ పరీక్షలో ప్రతిభ చూపినందుకే సచివాలయ ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పుడు అవి పర్మినెంట్ చేసే పేరుతో మరో పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. సచివాలయ ఉద్యోగులను బేషరతుగా పర్మినెంట్ చేయాలని, డిమాండ్ చేస్తున్నారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?