మంచు గడ్డగా మారిన సముద్రం చిక్కుకున్న పడవలు.

  0
  6437

  ఆర్కిటిక్ సముద్రంలో రష్యా తీరంలో 18 ఓడలు నీటిలో ఇరుక్కుపోయాయి. నీటిలో ఇరుక్కుపోవడం అంటే, నేలమీద బురదలో వాహనాలు ఇరుక్కున్నట్టే.. సముద్రంలో కూడా ఈ షిప్ లు కదలకుండా నిలిచిపోవడం వెనక కారణం సముద్రంలో నీరంతా గడ్డకట్టడమే. ఆర్కిటిక్ సముద్రంలో 30సెంటీమీటర్ల మేర మంచుగడ్డగా మారింది. లెప్టావా మరియు తూర్పు సైబీరియా సముద్రాలు ఇలా మారడంతో ఓడలు చిక్కుకుపోయాయి. ఈ మంచు కరగందే ఓడలు కదిలే వీలు లేదు.

  ఇలాంటి పరిణామం 32 ఏళ్ల క్రితం ఏర్పడిందని, వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంత తొందరగా ఈ ప్రాంతంలో సముద్రం గడ్డకట్టిపోతుందని ఊహించలేదని, అందువల్లననే తాము ఓడలకు అనుమతి ఇచ్చామని షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పుడు ఐస్ బ్రేకర్స్ కూడా ఆ ప్రాంతానికి పోలేని పరిస్తితి. రష్యా వాతావరణ హెచ్చరికలు సక్రమంగా లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించి సముద్రం గడ్డకట్టుకుపోయి 18 ఓడలు ఇరుక్కుపోయాయని చెబుతున్నారు. ఒకవేళ ఐస్ బ్రేకర్ ఓడలను పంపినా 2వారలకు పైగా సమయం పడుతుందని చెబుతున్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.