పెళ్ళిలో డీజే కే కోళ్లు చచ్చాయి అని కేసు

  0
  350

  ఇటీవల తన గేదె పాలివ్వడంలేదని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టిన విషయం మరువకముందే, పెళ్లిలో డీజే బ్యాండ్ సౌండ్స్ వల్ల తన కోళ్లఫారం లోని 63 కోళ్లు చనిపోయాయని కేసు పెట్టారు. ఒడిశా బాలాసోర్ జిల్లాకు చెందిన కందర్ గడి గ్రామంలో రామచంద్ర పరిడ అనే వ్యక్తి తన కూతురు పెళ్లికి ఊరేగింపుగా తీసుకు వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ ఊరేగింపు తన కోళ్ల ఫారం పైగా వచ్చిందని, ఊరేగింపులో డీజే మ్యూజిక్ సౌండ్స్ ఎక్కువ కావడం వల్ల, దీనికి తోడు టపాకాయలు కూడా కాల్చడం వల్ల తన కోళ్ల ఫారంలోని 63 కోళ్లు చనిపోయాయని రంజిత్ పరిడా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోళ్లు రాత్రి సమయంలో నిద్రపోతాయని, ఎక్కువ శబ్దాలు వచ్చిన వాటి గుండె ఆగి చనిపోతాయని ఈ కారణంగానే తన కోళ్లు చనిపోయాయని, అందువల్ల కేసు పెట్టి తనకు నష్టపరిహారం ఇప్పించాలని పోలీసులను కోరారు.

  దీంతో పోలీసులు తల పట్టుకుని, వెటర్నరీ డాక్టర్ సలహాకోసం ఈ కేసు వివరాలను పంపించారు. డాక్టర్ సలహా విన్న తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. కోళ్లను పోస్ట్ మార్టమ్ చేయించకుండానే ఎందుకు పూడ్చేశారంటూ కోళ్లఫారం యజమానిపై కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెట్టినప్పుడు కోళ్లు ఎందుకు చనిపోయాయో తెలుసుకోవాలంటే వాటికి చనిపోయిన విషయాన్ని పరీక్షించాలన్న విషయం తెలియదా అని గద్దించారు. మొత్తమ్మీద ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.