ఆంటీ నైట్ పార్టీకి పిలుస్తుంది.. వెళ్లారో అంతే సంగతి..!

  0
  616

  ఆంటీ నైట్ పార్టీకి పిలుస్తుంది.. వెళ్లారో అంతే సంగతి..!

  పార్టీల ఆంటీగా పాపుల‌ర్ అయిన శిల్పా చౌద‌రి బాగోతాలు ఒక్కొక్కటిగా బ‌య‌ట‌కొస్తున్నాయి. సెల‌బ్రిటీల‌కు, సినీ ప్ర‌ముఖ‌ల‌కు, బిజినెస్ టైకూన్లకు కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిన శిల్పాని, ఆమె భ‌ర్త‌ని నార్సంగి పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆమె అరెస్టు కావ‌డంతో బాధితులంతా ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ కి క్యూ క‌డుతూ, తాము కూడా మోస‌పోయామంటూ కేసులు పెడుతున్నారు. ఆడ‌వారికి కిట్టీ పార్టీలు, మ‌గ‌వారికి స్పెష‌ల్ పార్టీలంటూ పిలిచి, స‌ర్వం స‌మ‌కూర్చి… మాట‌ల‌తో ఏమార్చి… కోట్ల రూపాయ‌లు దోచేసిందీ కిలాడీ. డ‌బ్బులు అడిగితే బ్లాక్ మెయిలింగ్ చేయ‌డం వంటి నేరాల‌కు కూడా పాల్ప‌డింది. అంత‌టితో ఆగ‌కుండా ఎవ‌రైనా డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని అడిగేందుకు ఇంటికి వ‌స్తే బౌన్స‌ర్ల‌ను పెట్టించి వారితో కొట్టిండ‌చం, గెంటేయించ‌డం చేసేద‌ని బాధితులు వాపోతున్నారు. సినిమాల ఉన్న ఇంట్రెస్ట్ తో శిల్పా.. ‘సహేరి’ అనే సినిమాకు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.