పెళ్లికాకముందే అమ్మాయి వేధింపులకు అబ్బాయి బలి..

  0
  205

  ఎంగేజ్ మెంట్ మాత్రమే అయింది.. పెళ్లి వచ్చే నెలలో.. అయితే పెళ్ళికాకముందే కాబోయే పెళ్ళాం వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే పెళ్లికూతురు వేధింపులు తట్టుకోలేకనే , జీవితం చాలిస్తున్నానని చెబుతూ లేఖ రాసాడు. గుజరాత్ లోని నరోదకు చెందిన లఖిన్ మకిజాకు , ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్ మెంట్ అయిన మూడో రోజే , అమ్మాయి ఐ ఫోన్ గిఫ్ట్ అడిగింది.. కాబోయే భార్యేకదా అని ఐ ఫోన్ కొనిచ్చాడు.

  తరువాత లడఖ్ టూర్ పోదామంటూ , లక్ష రూపాయలు ఖర్చుపెట్టించింది. మళ్ళీ నగలు , డ్రెస్సులు అంటూ ఐదు లక్షలు ఖర్చు పెట్టించింది.. అవసరాలకు డబ్బులంటూ 12 లక్షలు డబ్బు తీసుకుంది.. ఇలా పెళ్ళికి ముందే , లఖన్ ని చిత్రహింసలు పెట్టి , మానసికంగా వేధించింది. పై చదువులకు తాను కెనెడా పోతానని , కోటి రూపాయలు డబ్బులు డిపాజిట్ చేయమని పోరుపెట్టింది. దీంతో అప్పటికే అమ్మాయితో విసిగిపోయిన , లఖన్ ఆత్మహత్య చేసుకున్నాడు, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. ఆత్మహత్య తరువాత , అబ్బాయికి , అమ్మాయికి మధ్య జరిగిన వాట్సాప్ మెస్సేజీలు , ఆభరణాల బిల్లులు , డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వివరాలు పోలీసులు స్వాధీనం చేసుకొని అమ్మాయిపై కేసుపెట్టారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..