వంద మాటల్లో కూడా చెప్పలేని భావాలను ఒక్క ఫోటో చెబుతుంది. ఆలోచింప చేస్తుంది. మనసును రంపింప చేస్తుంది. గుండెను పిండేస్తుంది. ఇలా ఎన్నో భావాలను ఒక్క ఫోటో పలికిస్తుంది. అలాంటి ఫోటోనే ఇది కూడా.
మండుటెండలో తనకు ఉపాధి కల్పించే ఎద్దుకు ఎండ తగలకుండా ఉండేందుకు, ఆ ఎద్దుకు ఎండతాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు .. ఆ మూగజీవం పట్ల ఆ యజమానికి ఉన్న ఆపేక్షకు ఈ ఫోటో చక్కని నిదర్శనం. తన కడుపు నింపే , ఎద్దుకు , నీడ కల్పించి ,తాను ఎండలోనే బండి తోలే , ఈ కష్టజీవికి , తనకు, తన కుటుంబానికి కూడు పెట్టే , మూగజీవిపై మమకారం నిజంగా గొప్పదే.. ఆ పేదవాడికి దండంపెట్టాల్సిందే..