వంద తీసుకునేవాడివి నువ్వు కూడా మాట్లాడ‌తావా .?

  0
  1503

  హైద‌రాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతంలోని భోల‌క్ పూర్ ఓ కార్పోరేట‌ర్ హ‌ల్చ‌ల్ చేశాడు. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా హోట‌ళ్ళు తెరిచే ఉండ‌డంతో పోలీసులు అక్క‌డికి వెళ్ళి, దుకాణాలు మూసి వేయాల‌ని సూచించారు. అయితే అక్క‌డే ఉన్న ఎంఐఎం కార్పోరేట‌ర్, పోలీసుల‌పై వాగ్వాదానికి దిగాడు. ఇది నా ఏరియా.. ఇక్క‌డ నీ రూల్స్ న‌డ‌వ‌వు. 24 గంట‌లు దుకాణాలు తెరిచే ఉంటాయి. వ‌చ్చిన వాడికి డ్యూటీ చేసుకుని పో.. త‌మాషాలు చేయ‌ద్దు అంటూ పోలీసుల‌కు వార్నింగ్ ఇచ్చాడు.

  అంతేకాకుండా మ‌రో పోలీసును వంద తీసుకునేవాడివి నువ్వు కూడా మాట్లాడ‌తావా .. మీ ఎస్సైని పిలువు, కార్పోరేట‌ర్ వ‌చ్చాడ‌ని చెప్పు.. అంటూ ఫైర్ అయిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. స‌ద‌రు కార్పోరేట‌ర్ పై పోలీసులు యాక్ష‌న్ తీసుకోవాల‌ని, పోలీసుల స‌త్తా చూపించే స‌మ‌యం ఇదేనంటూ ట్వీట్ చేస్తూ, ఆ వీడియోని డీజీపీకి పోస్ట్ చేశారు.

  అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌, ఉద‌యం ముషీరాబాద్ పోలీస్ స్టేష‌న్ కి వెళ్ళిన కార్పోరేట‌ర్ గౌసుద్దీన్ మ‌హ్మ‌ద్.. పోలీసుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆవేశంలో మాట్లాడినందుకు ప‌శ్చాత్తాపం చెందుతున్నాన‌ని, త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో పోలీసుల మ‌న‌సు నొప్పించినందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని అన్నారు.

   

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..