తొమ్మిదో పెళ్ళిలో చిక్కిన నిత్యపెళ్లికూతురు

  0
  413

  పెళ్లిళ్లు చేసుకోవడం.. వేధింపులని బెదిరించడం.. విడాకులు అడగడం.. పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేయడం.. ఇదే ఆమె వృత్తి..కాకపోతే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు నగానట్రా ఎత్తుకొని పరార్ కావడం.. ఇలాగే అబ్బాయిలను మోసం చేసి లక్షలు సంపాదించింది.. ఇదే పద్దతిలో తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది.. చివరకు పోలీసులకు చిక్కింది.. పెళ్లికాని ముదురు బ్రహ్మచారులు , భార్యలతో విడాకులు తీసుకున్నవారిని ఏరికోరి ఎంచుకుంటుంది.. ఇలాగా తన మోసాలకు అంతులేకుండా చేసుకుంటూ పోయింది.. ఇప్పుడు సడెన్ గా , ఆమెను పెళ్లిచేసుకున్న వాళ్ళంతా , దిగులుతో చేస్తున్నారు.. ఎందుకో తెలుసా..? ఆమెకు ఎయిడ్స్ సోకింది.. దాంతో ఆ మహమ్మారి తమనెక్కడ పట్టుకుందోనని టెస్టులకు పరుగులు తీశారు. ఈ మాటలాడి పెళ్ళిళ్ళ మోసం 11 ఏళ్ళ క్రితం మొదలైంది.. దాదాపుగా ఏడాదికొక మొగుడుగా సాగిపోయింది. హర్యానా , కైతల కి చెందిన వ్యక్తితో తన పెళ్లిళ్ల యజ్ఞం మొదలుపెట్టింది. మొదటి మొగుడు ఏమయ్యాడో ఇంతవరకు తెలియదు. పాటియాలా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.. ఆమె మాజీ భర్తలను హెచ్ ఐవి టెస్ట్ లు చేయించుకోమని సలహా ఇచ్చారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్