ఉంపుడుగత్తె కోసం నాలుగు హత్యలు..

    0
    1899

    ఉంపుడుగత్తె కోసం నాలుగు హత్యలు.. చివరకు తానే చనిపోయినట్టు మరో నాటకం.. అందుకోసం మరొకడి హత్య.. ఎట్టకేలకు వాడి కుట్రలకు పోలీసులు ముగింపు పలికి , మూడేళ్ళ తరువాత అరెస్ట్ చేశారు.. రాకేష్ అనే యువకుడు , నోయిడాలోని ఒక ప్రయివేట్ ల్యాబ్ లో పాథాలజిస్ట్ గ పనిచేస్తున్నాడు. యూపీలోని కసాంగంజ్ లో , భార్య ఇద్దరు పిల్లలతో సంసారం.. అయితే ఒక మహిళతో అక్రమసంబంధంతో , కుటుంబాన్ని వదులుకోవాలనుకున్నాడు.. భార్యని , మూడేళ్లు , 18 నెలల వయసున్న బిడ్డలను చంపేసి , తన ఇంట్లోనే గొయ్యితీసి పూడ్చిపెట్టి , సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేసాడు. మాజీ పోలీసు అయినా తండ్రి కూడా సహకరించాడు. తర్వాత తన భార్యా బిడ్డలు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రాకేష్ మామ మాత్రం , అల్లుడుమీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. అయితే ఎంతకీ కేసు ఆచూకీ దొరక్కపోవడంతో , కసాంగంజ్ లోనే , తల , చేతులు లేని ఒక మొండెం కాలిపోయి కనిపించింది.

    మొండెంవద్ద రాకేష్ ఐడి కార్డులు , చెప్పులు , పర్స్ ఉన్నాయి.. దీంతో ఆ శవం రాకేష్ దాని భావించారు.. కేసుని పక్కదారి పట్టించేందుకే రాకేష్ తనలాగే ఉండే వ్యక్తిని చంపేసి , తన ఆనవాళ్లు అక్కడ వదిలేసి , కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసాడు. తర్వాత హర్యానాకు వెళ్ళిపోయి దినేష్ అనేపేరుతో పాథాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ లోగా మొండెం కు సంబందించిన డీఎన్ ఏ రిపోర్ట్ వచ్చింది. శవం రాకేష్ డి కాదని తేలింది. దీంతో పోలీసులు విచారణ చేసి రాకేష్ ని , అతడి ప్రియురాలిని అరెస్ట్ చేశారు. ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య , బిడ్డల మృతదేహాలను చూపించాడు..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్