రివాల్వర్ తో సెల్ఫీ.. పెళ్లి కూతురు మృతి..

  0
  1887

  సెల్ఫీల పిచ్చి ఓ కొత్త పెళ్లి కూతురి ప్రాణం బలికొంది. తుపాకీ తీసుకుని కణతకు గురి పెట్టుకుని సెల్ఫీ తీసుకోవాలనుకుంది. పొరపాటున ట్రిగ్గర్ నొక్కుకుని ఆమె చనిపోయింది.
  ఉత్తర ప్రదేశ్ లో షాహాబాద్ ఏరియాలోని హర్దోల్ లో రాధిక అనే మహిళ ఆకాష్ అనే యువకుడిని రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. రాధికకు సెల్ఫీల పిచ్చి ఉంది. ఆ అలవాటుతో రోజూ భార్యా, భర్త సెల్ఫీలు దిగుతుంటారు. ఈ క్రమంలో రియల్ గన్ తో సెల్ఫీ దిగాలనుకుంది రాధిక. భార్య, భర్త ఇద్దరూ ఒకరికొకరు తుపాకీ గురిపెట్టి సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో రాధిక కణతకు గురిపెట్టిన తుపాకీ ఒక్కసారిగా పేలింది. తనకు తానే రివాల్వర్ గురి పెట్టుకుందని పొరపాటున ట్రిగ్గర్ నొక్కడంతో ఆమె చనిపోయిందని చెబుతున్నారు ఆమె భర్త, అత్తమామలు. పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం భర్త, అత్తమామలే చంపి సెల్ఫీ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?