ప్రియుడికోసం 7 మందిని చంపిన ఆమెకు క్షమాభిక్షా ?

  0
  2520

  తల్లిదండ్రులతోపాటు, అన్న, వదిన, తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు, అక్క బిడ్డను అతి కిరాతకంగా చంపిన ఓ హంతకురాలు షబ్నం ఉరిశిక్ష వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. 2007లో తన లవర్ సలీంతో కలసి ఉండేందుకు, కుటుంబ సభ్యుల్ని అడ్డు తొలగించుకునేందుకు షబ్నం ఈ పని చేసింది. కుటుంబ సభ్యులు ప్రమాదంలో మృతి చెందినట్టు పోలీసుల్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులు షబ్నంను, హత్యల్లో ఆమెకు సహకరించిన సలీంను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.

  అప్పటికి ఆమె 7 నెలల గర్భవతి. 2008లో ఆమె బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డను ఆమె స్కూల్ ఫ్రెండ్ పెంచుకుంటున్నారు.ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా లో జరిగిన ఈ ఘటనలో ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు ఉరి శిక్ష ఖరారు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త కలకలం రేపింది. చాలా కాలం తర్వాత ఓ మహిళకు భారత దేశంలో ఉరిశిక్ష పడిందనే వార్త సంచలనంగా మారింది. అయితే ఆ శిక్ష ఇంకా అమలు కాలేదు. ఈలోగా శిక్ష తగ్గించేలా చూసేందుకు షబ్నం తరపు లాయర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఉత్తర ప్రదేశ్ గవర్నర్ కు ఈమేరకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టారు. గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఈ క్షమాభిక్ష పిటిషన్ ను పరిశీలించాలంటూ జైళ్ల శాఖను దాన్ని బదిలీ చేసింది. దీంతో మరోసారి ఈ షబ్నం ఉరికంబం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.డబుల్ పీజీ చేసిన షబ్నం.. ఆరో తరగతి ఫెయిలై, కొయ్య పని చేసుకుంటున్న లవర్ కోసం.. విచక్షణా రహితంగా కుటుంబసభ్యుల్నే చంపుకుంది. ప్రేమమైకంలో కళ్లు మూసుకుపోయి పసి పిల్లల ప్రాణాలు కూడా తీసింది. షబ్నంకు ఉరిశిక్ష వేయాలని ప్రజలనుంచి కూడా డిమాండ్ మొదలైంది. మరి పాలకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?