సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. 11మంది సజీవ దహనం..

  0
  245

  చుట్టూ తుక్కు సామాను. ఆ సామాను సేకరించే పనివారంతా అక్కడే రాత్రి నిద్రపోయారు. రాత్రి గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చుట్టుముట్టారు. నిద్రలోనే 11మంది అక్కడికక్కడే చనిపోయారు. సికింద్రాబాద్‌ బోయగూడలో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. టింబర్‌, స్క్రాప్‌ గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌ తో మంటలు చెలరేగాయి. ఈవేకువజామున 4 గంటలకు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

  బోయగూడ ఐడీహెచ్‌ కాలనీలోని స్క్రాప్‌ దుకాణంలో 15 మంది కార్మికులు రాత్రి ఆ ప్రాంగణంలోనే నిద్రపోయారు. షార్ట్ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయట పడగా.. మిగిలిన 13 మంది మంటల్లో చిక్కుకున్నారు.

  వీరిలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఘటనాస్థలానికి ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కట్టెలతో పాటు మంటలు త్వరగా వ్యాపించే స్వభావం ఉన్న వస్తువులు అక్కడ ఉండటంతోనే ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..