కైలాస మానససరోవర యాత్ర సులభం కానుంది.. ఇక డైరెక్ట్ రోడ్డు..

    0
    102

    కైలాస మానస సరోవర యాత్రకు ఆటంకాలు తొలగ నున్నాయి.. ఇకనుంచి ఈ యాత్రకు చైనా ,నేపాల్ దేశాల భూభాగం నుంచి పోవాల్సిన అవసరం లేదు . మానస సరోవర యాత్ర కోసం రకరకాల అనుమతులకు ఇకనుంచి ఇబ్బందులు ఉండవు. దీనికి కారణం మన దేశంలోని నుంచే కైలాస మానస సరోవర యాత్రకు నేరుగా మార్గం ఏర్పాటు చేస్తున్నారు . పితోర్ గర్, ఉత్తరాఖండ్ నుంచి మానససరోవర కు నేరుగా రోడ్డు మార్గం ఏర్పాటు అవుతుంది . ఇప్పటివరకూ కైలాస్ మానస సరోవర యాత్రకు పోవాలంటే ప్రయాసతో కూడుకున్న పని . కొండ మార్గాలు ,కొండచరియలు దాటి పోవలసి వస్తుంది . ఇక నుంచి ఆ అవసరం ఉండదు . ప్రయాణం చాలా సాఫీగా జరగబోతుంది.

    2023 డిసెంబర్ నాటికి కైలాస మానస సరోవర క్షేత్రానికి ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది . ఇది కాకుండా ఢిల్లీ నుంచి శ్రీనగర్ ప్రయాణం సమయం తగ్గిపోయేందుకు కొత్తగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు . ఈ రోడ్డు మార్గం 7 వేల కోట్ల రూపాయల వ్యయంతో మొదలు పెట్టబోతున్నారు . ఇది మొదలైతే ఢిల్లీ , శ్రీనగర్ మధ్య రాకపోకలు సులువుగా ఉంటాయి . తక్కువ వ్యవధిలో శ్రీనగర్ కు చేరుకునే అవకాశం ఉంటుంది . మరో మార్గాన్ని ఢిల్లీ నుంచి కార్గిల్ వరకు , కార్గిల్ నుంచి జెడ్ మోర్ వరకు జెడ్ మోర్ నుంచి శ్రీనగర్ వరకు, శ్రీనగర్ నుంచి జెడ్ మోర్ వరకు మార్గం ఏర్పాటు చేస్తున్నారు.

    జోజిలా సొరంగ మార్గాన్ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు . 1000 మంది కార్మికులు ఇక్కడ రేయింబవళ్ళు పని చేస్తున్నారు . 2024 కల్లా కాశ్మీర్ లోని ముఖ్యమైన ప్రాంతాలకు ఢిల్లీ కి మధ్య సులభమైన అనుసంధానం ఏర్పడుతుంది. అమృతసర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఢిల్లీ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 8 గంటలు తగ్గిస్తుంది . దేశంలో 28 ఎక్స్ప్రెస్ హైవే లనూ అన్నివిధాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నారు . వీటిలో హైవేస్ లో ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర సహాయానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

    జాతీయ రహదారుల మీద ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బ్రిడ్జి నిర్మాణానికి 1,600 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి సేతు భారతం అని పేరు పెట్టారు . ఎంపీలు తమ నియోజకవర్గాల్లో జాతీయ రహదారులపై బ్రిడ్జిలు అవసరమైన చోట్ల చెబితే వెంటనే మంజూరు చేస్తామని కూడా నితిన్ గడ్కరీ పార్లమెంట్లో ప్రకటించారు..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..