బీస్ట్ సినిమా బాగాలేదని ధియేటర్ లో స్క్రీన్ కాల్చేశారు.

  0
  2760

  తమిళనాడులో సినిమా హీరోల అభిమానులు ఏదిచేసినారచ్చ , రచ్చ.. సినిమా బాగుంటే హంగామా చెప్పనలవికాదు.. బాగాలేకపోతే ఏమిచేస్తారో వాళ్లకే తెలియదు. ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ నటించి , బీస్ట్ సినిమా బాగాలేదని ఏకంగా ధియేటర్ స్క్రీన్ కె నిప్పు అంటించారు. సినిమా బాగాలేకపోతే , సినిమా తీసిన వాణ్ని , లేదంటే హీరోని , లేదంటే డైరెక్టర్ ని , చొక్కా పట్టుకోవాలిగాని , ఏకంగా సినిమా హాళ్లలో స్క్రీన్ కాల్చేశారు.

  విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉదయంనుంచే ఫ్లాప్ అన్న టాక్ వచ్చేసింది. ఈ సినిమా కోసం పాపం , ఫ్యాన్స్ కొన్ని హాల్స్ దగ్గర , సినిమా చూసిన వాళ్లకు ఫ్రీగా పెట్రోల్ కూపన్లు కూడా ఇచ్చారు. . బీస్ట్ మూవీ చూసేందుకు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చాయి. మరికొన్ని కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఇచ్చాయి. సినిమా దియేటర్ యాజమాన్యాలు కూడా , ఎఫ్ డి ఎఫ్ ఎస్ అనే స్కీం కింద , ఫస్ట్ డే , ఫస్ట్ షో కి , ఐదు టికెట్లు కొన్నవాళ్లకు , ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇచ్చారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.