సినిమా చూస్తే లీటర్ పెట్రోల్ కూపన్ ఫ్రీ..

    0
    74

    తమిళనాడులో సినిమా హీరోల అభిమానులు ఏదిచేసినా వెరైటీగా ఉంటుంది.. సినిమా రిలీజ్ కు ముందు పాలాభిషేకాలు , కటౌట్ , టపాకాయలు పేలుళ్లు , డీజే బ్యాండ్ లు .. ఇలాంటివన్నీ తమిళ ఫ్యాన్స్ నుంచి దిగుమతి అయినవే., ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ నటించి , బీస్ట్ సినిమా చూసిన వాళ్లకు లీటర్ పెట్రోల్ ఫ్రీ స్కీం పాపులర్ అయింది.

    ఫ్యాన్స్ సంఘాలే కాకుండా , సినిమా దియేటర్ యాజమాన్యాలు కూడా , ఎఫ్ డి ఎఫ్ ఎస్ అనే స్కీం కింద , ఫస్ట్ డే , ఫస్ట్ షో కి , ఐదు టికెట్లు కొన్నవాళ్లకు , ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇచ్చారు. బీస్ట్‌ మూవీ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొన్ని సినిమా హాల్స్ వద్ద , సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకులకు , ఫ్యాన్స్ ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు ఉచితంగా ఇస్తున్నారు. బీస్ట్ మూవీ చూసేందుకు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చాయి. మరికొన్ని కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఇచ్చాయి..

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.