సత్యనాదెళ్ల జీవిత విజయంలో ఇంత విషాదమా..?

    0
    3632

    విధిరాత ఎంత క్రూరంగా ఉంటుందో మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీవితమే ఒక ఉదాహరణ. మైక్రో సాఫ్ట్ సీఈఓ గా ఉన్న సత్య నాదెళ్ల.. ప్రపంచ భారతీయ ప్రముఖుల్లో మొదటి ఐదు స్థానాల్లోనే ఉంటారు. అలాంటి సత్య నాదెళ్ల జీవితాల్లో, విజయాల వెనుక తండ్రిగా.. ఒక తట్టుకోలేని బాధను, ఆయన 26 ఏళ్లుగా తనలోనే దాచుకున్నారు. అయన కొడుకుకు జైన్ నాదెళ్లకు పుట్టుకతోనే సెరెబ్రిల్ పాల్సి అనే వ్యాధి ఉంది. అంటే చిన్నవయసు నుంచే కదల్లేడు.. మాట్లాడలేడు.. చెప్పింది వినలేడు.. పూర్తిగా శారీరక మానసిక వైకల్యంతో పుట్టిన బిడ్డను 26 ఏళ్లుగా కంటిపాపల చూసుకున్నారు.

    శారీరకంగా కొడుకు బాగా ఎదిగినా బయట ప్రపంచం చూడలేని.. తెలుసుకోలేని శాశ్వత వికలాంగతనం ఉండి పోయింది. అందుకే చిన్నప్పటి నుంచే ఆ బిడ్డను ఒక బొమ్మలా 26 ఏళ్లపాటు తల్లిదండ్రులు చూసుకున్నారు. తన బిడ్డ దుస్థితి చూసిన తర్వాత.. ఇలాంటి బిడ్డలు కనీసం కూర్చునేందుకు..వారిని తీసుకెళ్లేందుకు కూడా రకరకాల ఉత్పత్తులను తీసుకొచ్చారు. అయితే విధి వెక్కిరించడంతో ఇప్పుడు ఆ మానసిక వికలాంగుడైన కొడుకు కూడా సత్య నాదెళ్లకు దూరమయ్యారు.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..