ఆహరం కోసం క్యూలో ఉండగా క్షిపణి శకలం తగిలి..,

    0
    1180

    ఉక్రెయిన్ లో భారత్ కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఉక్రెయిన్ లోని ఖార్కీవ్ గవర్నర్ హౌస్ మీద జరిగిన బాంబు దాడిలో నవీన్ అనే కర్ణాటక విద్యార్థి కన్నుమూశారు. ఆహారం కోసం క్యూ లైన్లో నిలబడి ఉండగా ఈ దారుణం జరిగింది.

     

    రష్యా సైన్యం బాంబు దాడులు చేయడంతో గవర్నర్ భవనం కుప్పకూలింది. ఆ శకలాలు తగిలి నవీన్ మృతి చెందినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చనిపోయిన నవీన్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్నట్టు తెలుస్తోంది.

     

    ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా భారత్ లో ఆందోళన నెలకొంది. భారత్ కు చెందిన దాదాపు 18 వేలమంది విద్యార్థులు ఉక్రెయిన్ లో చదువుకుంటున్నారు. వీరిలో దాదాపుగా 2 వేలమంది విద్యార్థులను భారత ప్రభుత్వం క్షేమంగా తీసుకొచ్చింది. అయితే మిగిలినవారు మాత్రం ఉక్రెయిన్ లోనే చిక్కుకున్నారు.

     

    ప్రస్తుతానికి రష్యా భీకరమైన దాడులు చేస్తుండటంతో అక్కడ ఉన్న భారత విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు.

    అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు కీలక ప్రకటన జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా కీవ్ నగరాన్ని విడిచి బయటకు వచ్చేయాలని ప్రకటించారు.

     

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..