సినీనటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ కేసులో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మేకప్ మెటీరియల్ చోరీ చేశాడంటూ నాగశ్రీను అనే వ్యక్తిపై, మోహన్ బాబు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగశ్రీను తాజాగా సంచలన విషయాలను బయటపెట్టాడు.
10 ఏళ్ల నుంచి మోహన్ బాబు ఇంట్లోనే పనిచేస్తున్నానని.. అలాంటి తనకు చోరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. మోహన్ బాబు తనను బూతులు తిడుతూ.. దారుణంగా అవమానించారని.. అందుకే పనిమానేశానని చెప్పుకొచ్చాడు. అందరిముందు మోకాళ్లపై కూర్చోబెట్టి.. తనను తన పిల్లలను.. తన తల్లిని, మోహన్ బాబు అవమానించారని వీడియో రిలీజ్ చేశారు.
తనను కులం పేరుతో దూషించాడని అందుకే.. మోహన్ బాబు వద్ద పని మానేసినట్టు పేర్కొన్నారు. పని మానేసిన కారణంగా తనపై తప్పుడు కేసులుపెట్టారని వీడియోలో పేర్కొన్నారు. తనలాంటి పేద వాడితో.. మోహన్ బాబు వంటి పెద్దలు ఇలా దారుణంగా ప్రవర్తించడం తప్పని చెప్పారు.