కైకాల సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత..

  0
  166

  సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. గత నెల 30న కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జారిపడటంతో కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రెండేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.