రైల్వే స్టేషన్లలో కొత్తగా వెయిటింగ్ రూమ్ లు.

  0
  146

  అవి హోటళ్లు కాదు, కానీ అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. హోటల్ లో ఇచ్చినట్టు రూమ్ అద్దెకివ్వరు, అలాగని మడతమంచాలు అద్దెకిచ్చే వ్యవహారం కూడా కాదు. కానీ దాదాపు అలాంటిదే. ఓ మంచం అద్దెకిస్తారు. అయితే దాని చుట్టూ ఓ సెటప్ ఉంటుంది. వీటిని పాడ్ రూమ్ లు అని పిలుస్తారు. విదేశాల్లో ఇలాంటివి బాగా ఫేమస్. ఇప్పుడు వీటిని భారతీయ రైల్వే స్టేషన్లలో కూడా అందుబాటులోకి తెస్తున్నారు.

  ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ లోని మొదటి అంతస్తులో 48 గదులతో కూడిన తొలి పాడ్‌ వెయిటింగ్‌ రూంను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో క్లాసిక్ పాడ్‌లు, ప్రైవేట్ పాడ్‌లు “లేడీస్-ఓన్లీ” పాడ్‌లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పాడ్‌లు వంటి గదులు ఉన్నాయి. దీన్ని క్యాప్సూల్ హోటల్‌గా పిలిచే ఈ పాడ్ హోటల్‌లో ఒక్కో మంచంతో కూడిన చిన్న గదులు ఉంటాయి. ఈ మోడల్ జపాన్‌లో ఉద్భవించింది. ఇది కేవలం రాత్రి బస చేయడానికి లేదా చిన్న వ్యాపార పర్యటనలో అలసటతో నిద్రపోవడానికి బయట హోటల్‌కి వెళ్లడానికి విముఖత చూపే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ కాంపాక్ట్ వసతి పరిష్కారాన్ని అందించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో వీటి వీడియోని షేర్ చేశారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.