శశికళా నువ్వొద్దు , నిన్నెవరూ పిలవలేదు.

    0
    45

    తమిళనాట మళ్లీ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో నిరసన గళం వినిపిస్తోంది. శ‌శిక‌ళ‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అన్నాడీఎంకే పార్టీలోకి ఆహ్వానించేది లేద‌ని ఆ పార్టీ నేత‌లు భీష్మిస్తున్నారు. పార్టీని విఛ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఆమె రాజకీయ ప్రవేశంతో పార్టీకి మేలు జరగదని… కీడే ఎక్కువగా జరుగుతుందని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

    ఆమె రాక వ‌ల్ల పార్టీలో చీలిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, కుట్ర‌లు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన శశికళ.. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడంతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో ఆమె పార్టీలోకి వ‌చ్చి చ‌క్రం తిప్పాల‌నే వ్యూహం ర‌చిస్తోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలో చేరాల‌నే సంకేతాలను త‌న అనుచ‌రుల ద్వారా పంపించింది. దీనిపై ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌సేమిరా అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు మళ్లీ ఆమె రాజకీయాల్లో ప్రవేశిస్తుందనే వార్తలు హల్‌చల్ చేయ‌డంతో పాటు ఏఐఏడీఎంకే వర్గాల్లో కలవరం ప్రారంభమైంది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..