మూడో విడత కరోనా దెబ్బఅంటే ఎందుకంత భయం.. ?

  0
  43

  2020 సంవత్సరం కరోనా మహా విలయంతోనే ప్రారంభమైంది. ఇటీవల కాలంలో కరోనా మొదటి దశ, రెండో దశ, మూడో దశ.. ఇలా చెప్పుకుంటూ పోతున్నాం. అసలు కరోనా ఎలా పరివర్తన చెందుతుంది, దాని రూపాన్ని ఎలా మార్చుకుంటుంది. మార్చుకున్న రూపం ఎలా ప్రమాదకరంగా మారుతుంది. కరోనా కొత్తరకాలు మ్యుటేషన్లు, రెండూ ఒకటేనా. ఇలాంటి ప్రశ్నలకు ప్రపంచంలోని ప్రముఖ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ ‘లింగ్ లీ మిన్’ వివరంగా చెప్పారు.

  కరోనా వైరస్ ఒక మనిషిలోకి ప్రవేసించిన తర్వాత అది ప్రత్యుత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది. తనలాంటి వైరస్ నే కోటానుకోట్లుగా సృష్టించుకుంటుంది. ఈ పరిణామంలో ఒక్కోదఫా దాని రూపం మార్చుకుంటుంది. సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఫొటో నెగెటివ్ తో సక్రమంగా ఫొటో తీయకపోతే ఆ ఫొటో రకరకాల మార్పులతో వస్తుంది. అలాగే కరోనా వైరస్ కూడా రోగి శరీరంలో ప్రత్యుత్పత్తి జరిగేటపుడు తన అసలు రూపానికి బదులు, విభిన్న రూపాలను సంతరించుకుంటుంది. దీన్నే మ్యుటేషన్ అంటారు.

  ఇలాంటి మ్యుటేషన్లు కొన్ని కలిస్తే దాన్ని కొత్త వేరియంట్ అంటారు. బ్రిటన్ లో వచ్చిన బి-117 వేరియంట్ వైరస్, సౌతాఫ్రికాలో వచ్చిన బి-135 వేరియంట్, బ్రెజిల్ లో వచ్చిన పి-1 వైరస్, 25కు పైగా వైరస్ మ్యుటేషన్లతో ఏర్పడ్డాయి. వైరస్ ప్రత్యుత్పత్తిలో జరిగే పొరపాట్లు లేదా, దాన్ని రూపాన్ని మార్చుకునే ప్రక్రియలో వైరస్ వల్ల కలిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు రూపాన్నుంచి వైరస్ మరో రూపాన్ని సంతరించుకునేటప్పుడు దాన్ని కొత్తరకం వైరస్ లేదా న్యూ స్ట్రెయిన్ అంటారు.

  అనేక రకాలైన వేరియంట్లు కలిపి కొత్త స్ట్రెయిన్ గా అవతరిస్తుంది. దాన్ని రూపాన్నే కాదు, స్వభావాన్ని కూడా వైరస్ కొత్త వేరియంట్లలో మార్చుకుంటుంది. తల్లి వైరస్ కంటే మారిన ఈ వైరస్ అత్యంత ప్రమాదకరంగా తయారవుతుంది. అత్యంత వేగంగానూ ఇతరులకు వ్యాపిస్తుంది. అందువల్లనే సెకండ్ వేవ్, మన భారత దేశంలో అంత భయానకంగా విస్తృతంగా వ్యాపించింది. ఇక థర్డ్ వేవ్ ఎలా ఉండబోతోందో.. దాన్ని బట్టే తెలుసుకోవచ్చు.


  సాధారణంగా ప్రతి నెలలోనూ కరోనా వైరస్ లో 2 లేదా 3 మ్యుటేషన్లు జరుగుతుంటాయి. ఇవి కొన్ని కలిస్తేనే కొత్త వేరియంట్ అవుతుంది. వైరస్ ఉనికికోసం మ్యుటేషన్ అనేది తప్పనిసరి. అందువల్ల ఈ వైరస్ ను వ్యాక్సినేషన్ తోనే కట్టడి చేస్తూ మాస్క్ లు, సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడంతోనే దాన్ని బలహీనం చేసి తరిమికొట్టాలని ఆమె అభిప్రాయ పడ్డారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..