పీటలమీదే భార్యాభర్తలు ,డబ్బుకోసం డ్రామా.

  0
  1286

  సామూహిక పెళ్లిళ్ల పేరుతో అక్కడక్కడ కొంతమంది తమ దాతృత్వాన్ని ప్రదర్శించుకునేందుకు కార్యక్రమాలు చేపడుతుంటారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి బంగారు తాళిబొట్టుతోపాటు కొత్తబట్టలు, కొన్ని వస్తువులు కొనిపెడుతుంటారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కువగా తాళిబొట్టు, వస్తువులకోసం జరిగే టెంపరరీ పెళ్లిళ్లు ఉంటాయి. సరిగ్గా ఉత్తర ప్రదేశ్ లో కూడా అదే జరిగింది. ఉత్తర ప్రదేశ్ లో యోగీ ప్రభుత్వం సామూహిక వివాహ యోజన అనే కార్యక్రమం చేపట్టింది.

  అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలి. సంవత్సరాదాయం 2 లక్షలు మించ కూడదు. అమ్మాయికి సొంత బ్యాంక్ అకౌంట్ ఉండాలి. వితంతువుల కూతుళ్లు, వికలాంగులు, వితంతు పునర్వివాహం, విడాకులు తీసుకున్నవారి వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలా సామూహికంగా ప్రభుత్వం ద్వారా పెళ్లి చేసుకుంటే కొత్త జంటకు రూ. 51 వేలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. 35వేల రూపాయలు నేరుగా అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. 10వేల రూపాయల బహుమతులిస్తారు. 6వేల రూపాయలు ఆహారం, భోజనం, డెకరేషన్ కి ఇస్తారు. అయితే ఇలా జరిగే పెళ్లిళ్లలో అన్నీ టెంపరరీ వివాహాలేనని తేలింది. దాదాపు 60శాతం జంటలు కేవలం డబ్బులకోసమే పెళ్లి చేసుకుంటున్నాయి. పెళ్లయిన తర్వా అమ్మాయి అకౌంట్ లో పడే డబ్బుల్ని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పంచుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే. ఇక పెళ్లి ఖర్చులు, కానుకల కింద వచ్చే డబ్బుల్ని అధికారులు నొక్కేస్తారు. డిసెంబర్ 11వతేదీ 263మంది పెళ్లి చేసుకోగా అందులో 80శాతం ఫేక్ వివాహాలని తేలాయి.

  ఇది మరో దారుణం..
  అంతవరకు పర్లేదు, ఏదో ప్రభుత్వం ఇచ్చే డబ్బులకోసం కక్కుర్తి పడ్డారనుకోవచ్చు. అయితే ఆ డబ్బులు వేరేవాళ్లకి ఎందకెళ్లాలి అనుకున్నారేమో.. ఏకంగా అన్న చెల్లెలు, అక్క తమ్ముడు కూడా ఈ సామూహిక వివాహ యోజనలో దండలు మార్చుకున్నారు. ఫిరోదాబాద్ లో ఇలా అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నట్టు తేలడంతో అధికారులు కేసు పెట్టారు. అయితే అప్పటికే వారు బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇలా అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు కేవలం డబ్బులకోసం పెళ్లి చేసుకున్న ఘటనలో యూపీలో నాలుగు వెలుగు చూశాయి.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.