నా డ్రస్సు ఎలా ఉంటే మీకేంటి -సమంత.

  0
  166

  నా డ్రస్సు ఎలా ఉంటే మీకేంటి -సమంత

  సమంత హర్ట్ అయింది, బాగా హర్ట్ అయింది. అయితే ఈసారి ఆమె తన విడాకుల విషయంలో ట్రోలింగ్ జరిగిందని కాదు, తన డ్రస్సింగ్ పై ట్రోలింగ్ జరిగినందుకు బాధపడింది. తన బాధను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. మహిళలపై వారు ధరించే దుస్తులు, మతం, విద్య, సమాజంలోని కీర్తి ప్రతిష్టలు, కనిపించే తీరు, రంగు ఇలా ఎన్నో రకాలు వివక్షను చూపుతుంటారని, మహిళలను అలా సులభంగా జడ్జ్ చేసేస్తుంటారని, ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందని.. అయినా ఇలా చేయడం తేలికేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల సమంత షేర్ చేసిన ఓ ఫొటోకు నెటిజన్లు ఘాటుగా రిప్లైలు ఇచ్చారు.

  అక్కినేని ఫ్యామిలీకి దూరంగా వెళ్లిన తరువాత సమంత మరింతగా రెచ్చిపోతోందని కామెంట్లు పెట్టారు. మితిమీరిన అందాల ప్రదర్శన ఎందుకు అంటూ సమంతను ప్రశ్నించారు. ఇలా మొత్తానికి సమంత ఫోటో షూట్ మాత్రం నెట్టింట్లో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపింది. తన మీద జరిగిన ట్రోలింగ్ గురించి సమంత బాధపడినట్టు కనిపిస్తోంది. దీంతో సమంత ట్రోలర్లకు గట్టిగా సమాధానమిచ్చింది.

  మనం ఇప్పుడు 2022లో ఉన్నాం.. ఇప్పటికైనా మహిళలను అలా జడ్జ్ చేయడం ఆపరా? వారేం ధరించారు.. ఎలా కనిపిస్తున్నారనేదానిపై వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారా?’..అంటూ సమంత అసహనం వ్యక్తం చేసింది. సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ మధ్యే విజయ్ దేవరకొండ సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..