ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష.. సౌదీలో రికార్డ్.

    0
    411

    సౌదీఅరేబియాలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేశారు. .. ప్రపంచ చరిత్రలోనే , ఒకే రోజు ఇంతమందికి మరణశిక్ష అమలు చేయడం ఇదే ప్రధమం. వీళ్ళందరికీ శిరచ్చేదం ద్వారా మరణ శిక్షను అమలు చేశారు. వీళ్లంతా ఇస్లామిక్ తీవ్రవాదులే.. రాజుకి , రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రచేశారని వీళ్ళను తలనరికి చంపేశారు. .ప్రాణాలు కోల్పోయిన వారిలో , ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు , అల్ ఖైదా ఉగ్రవాదులు , యెమెన్ హుతి తిరుగుబాటుదారులు, ఇతర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల సభ్యులు ఉన్నారు.

    ఉన్నారు. వీళ్లంతా , సౌదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర , సెక్యూరిటీ దళాల కుటుంబ సభ్యుల హత్య , పౌరులను బాంబు దాడులతో చంపే కుట్రలకు ప్లాన్ చేశారని , సౌదీ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. వీరిలో కొంతమంది కిడ్నాప్ , మారణాయుధాలు సరఫరా , అత్యాచార కేసుల్లో దోషులు ఉన్నారని చెప్పారు. మరణశిక్ష పడ్డ 81 మందిలో 73 మంది సౌదీ అరేబియా పౌరులే , ఏడుగురు యెమెన్ , ఒకరు సిరియాకు చెందినవారు. 13 మంది జడ్జీల బృందం వీళ్లకు సంబందించిన కేసులను విచారించింది.

    దేశంలో తీవ్రవాదాన్ని , తీవ్రవాదులను క్షమించే ప్రశ్న లేదని , మరణమే వారికి గుణపాఠమని ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేసింది. గత ఏడాది సౌదీలో 61 మరణ శిక్షలు అమలుచేయగా , ఈ ఏడాది ప్రారంభంలోనే ఒకే రోజు 81 మందిని ఉరితీసి చంపడం విశేషం.

    2020లో ప్రపంచ వ్యాప్తంగా 483 మరణశిక్షలు అమలుచేయగా , 88 శాతం మరణ శిక్షలు కేవలం నాలుగు దేశాలులో అంటే , ఇరాన్ లో 246, ఈజిప్టు లో 107, ఇరాక్ లో 45 , సౌదీలో 27 మిగిలినవి ఇతర దేశాలలో అమలు చేశారు. తీవ్రవాదులను సౌదీలో ఇదేపద్ధతిలో చంపేస్తారు. అక్రమ సంబంధాలు , రేప్ కేసుల్లో వాళ్ళను మాత్రం తాళ్లతో కొట్టి చంపేస్తారు. దేశ ద్రోహం కేసుల్లో కొంతమందికి శిరచ్చేదం , మరికొంతమందిని తుపాకీతో కాల్చడం ద్వారా మరణ శిక్ష అమలుచేసారు..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..