సమంత, నాగచైతన్య డైవర్స్ ప్రకటన అనంతరం సమంతపై అక్కినేని అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై క్లారిటీ కూడా ఇస్తూ, తన ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోవాలని సమంత పొలైట్ గా ఆన్సర్ ఇచ్చింది. తాజాగా ఓ నెటిజన్ సామ్ ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ట్రోల్ చేశాడు. దీనికి అంతే ధీటుగా రిప్లయ్ ఇచ్చిందామె.
ఇంతకీ ఆ నెటిజన్ ఏమన్నాడంటే…
”సమంత డైవర్స్ తీసుకుని నాశనమైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని, ఒక జెంటిల్‌మేన్ నుంచి రూ. 50 కోట్ల రూపాయలు దోచుకుంది” అని ట్రోల్ చేశాడు. దీనిపై సమంత అదే రీతిలో స్పందిస్తూ. “నీ ఆత్మను దేవుడు దీవించుగాక” అంటూ రిప్లయ్ ఇచ్చి చురకలంటించింది.
ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు కెరీర్ మీద ఫుల్ ఫోకస్ చేసింది. ఇటీవల పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి మంచి పటాస్ మీద ఉంది. ఇక శాకుంతలం షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజాగా యశోద చిత్రంలో నటిస్తోంది. కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఒక హాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. కాల్షీట్లు ఖాళీ లేనంతగా బిజీగా ఉంది సామ్.
ఇవీ చదవండి…