మగాళ్లకు హీటెక్కితే నేను సక్సెస్ అయినట్టే..

  0
  2343

  ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి ద‌శాబ్దం దాటినా స‌మంత అందం చెక్కు చెద‌ర‌లేదు. యంగ్ హీరోయిన్లు కూడా ఆమె అందం ముందు దిగ‌దుడుపే. ఇక అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌డంలో అంద‌రి కంటే ముందువ‌రుస‌లోనే ఉంది సామ్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అండ్ హాలీవుడ్ అంటూ వ‌రుస సినిమాల‌కు సైన్ చేసి ఫుల్ జోష్ లో ఉందీ బ్యూటీ.

  ఇక ఇటీవ‌ల ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా’ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ పాట దూసుకుపోతోంది. మగవాళ్లను చులకన చేసేలా ఉన్న‌న ఈ పాటపై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఈ ఐటెం సాంగ్ లో స‌మంత త‌న అందాల‌ను అప్ప‌నంగా ఆర‌బోసింది. ఆమె అందాల‌తో సినీ ల‌వ‌ర్స్ ఫిదా అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ చేశారు.

  ఇదంతా ప‌క్క‌న పెడితే… సెక్సీగా క‌నిపించ‌డంపై సామ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలో ఎన్నో ర‌కాల పాత్ర‌లు చేశాను. సాఫ్ట్ గా ఉండే పాత్ర‌లు చేశాను. స‌ర‌దాగా ఉండే పాత్ర‌లు చేశాను. కంటెంట్ ఉన్న పాత్ర‌లు చేశాను, సీరియ‌న్ నెస్ ఉండే పాత్ర‌లు చేశాను. టేక‌ప్ చేసే ప‌త్రి ప్రాజెక్టు కోసం ఎంతో క‌ష్ట ప‌డ‌తాను. కానీ సెక్సీగా ఉండ‌టం అనేది ఇంకో లెవ‌ల్. సెక్సీగా క‌నిపించ‌డం అంటే మాట‌లు కాదు.. అతి క‌ష్ట‌మైన ప‌ని. దాన్ని కూడా కూడా స‌క్స‌స్ ఫుల్ గా చేస్తున్నానంటూ కామెంట్స్ చేసింది. . అన్నింటికంటే శృంగారం వలకబోయడం చాలా కష్టం .. నేను దానిలో సక్సెస్ అయ్యాను అని చెప్పింది. సామ్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.

   

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.