గాలిపటం ఎగురవేస్తూ.. ఓ యువకుడు పైకి ఎగిరి పోయాడు. నేలపై నుంచి దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు పైకి వెళ్ళిపోయాడు. గాలిపటం ఎగురవేస్తే, మనిషి ఎలా ఎగిరిపోతాడని అనుకుంటున్నారా ? అవునండి బాబూ… ఇది నిజం. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాయ్ పండగ సందర్భంగా కుర్రాళ్ళంతా గాలిపటాలు ఎగురవేసేందుకు మైదానానికి వెళ్ళారు. అందులో ఓ యువకుడు జెయింట్ కైట్ ని ఆకాశంలోకి ఎగురవేశాడు. అతికష్టం మీద ఆ గాలిపటం పైకి ఎగిరింది. గాలి బాగా వీస్తుండడంతో ఇంకా పైకి ఎగిరింది. దాన్ని పట్టుకుని ఉన్న ఆ యువకుడు కూడా అమాంతంగా పైకి ఎగిరిపోయాడు. ఆ సమయంలో తాను ఎందుకు పైకి ఎగిరానో కూడా అర్ధం కాలేదు. అర్ధమయ్యే సరికి గాలి వేగానికి, గాలిపటం పైకి వెళుతున్న స్పీడుకి దాదాపు ఆ యువకుడు 30 అడుగుల పైకి వెళ్ళిపోయాడు. పరిస్థితి అర్ధం చేసుకుని గాలి పటానికి ఉన్న తాడు సహాయంతోనే కాస్త కిందికి జారాడు. అలా జారుతూ.. జారుతూ.. నేల మీద ఒక్కసారిగా పడ్డాడు. బతుకు దేవుడా అనుకుంటూ గాలిపటానికి దండం పెట్టాడు.
ఇవీ చదవండి…