ఈ లాయర్ మహా శృంగార వీర. ఆన్ లైన్ లోనే..

  0
  8096

  ఒక కేసుకు సంబంధించి హైకోర్టులో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు ఒక లాయ‌ర్ శృంగారం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆయ‌న‌ను బార్ కౌన్సిల్ నుంచి బ‌హిష్క‌రించాల‌ని ఆదేశించింది. చెన్నై హైకోర్టులో ఒక కేసుకు సంబంధించి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ జ‌రుగుతోంది. క‌రోనా నేప‌ధ్యంలో చాలాకాలంగా వ‌ర్ఛువ‌ల్ విధానంలోనే విచార‌ణ కొన‌సాగుతున్నాయి. రెండు వైపు పార్టీల‌ను హైకోర్టు వీడియో కాల్ ద్వారా వాద‌న‌లు వింటుంది. ఇంత‌లో సంతాన కృష్ణ‌న్ అనే అడ్వ‌కేట్ కు కామం త‌ల‌కెక్కిన‌ట్లుంది. కోర్టు అవ‌త‌లవైపు న్యాయ‌వాది వాద‌న‌లు వింటున్న‌ప్పుడు, తాను ఖాళీగా ఉండ‌డం ఎందుక‌ని అనుకున్నాడో ఏమో.. ప‌క్క‌నే ఉన్న మ‌హిళ‌ను గ‌ట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకుని, ఆమెను న‌లిపేయ‌డం మొద‌లుపెట్టాడు.

  వీడియో కాలింగ్ లో ప‌ట్ట‌ప‌గ‌లు ఈ న్యాయ‌వాది శృంగారాన్ని అంద‌రూ చూశారు. కొంత‌మంది రికార్డు కూడా చేశారు. ఈ రికార్డ్ చేసిన దృశ్యాలు క్ష‌ణాల్లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో హైకోర్టు కూడా అప్ర‌మ‌త్త‌మైంది. త‌మిళ‌నాడు, పాండిచ్చేరి బార్ కౌన్సిల్స్ త‌మ రాష్ట్రాల్లో ఆ న్యాయ‌వాదిని ప్రాక్టీస్ చేయ‌నీయ‌కుండా నిషేధం విధించారు. హైకోర్టు కూడా అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేసు న‌మోదు చేయాల‌ని కూడా ఆదేశించింది. కోర్టు హియ‌రింగ్ లో ఉన్న‌ప్పుడు న్యాయ‌వాదితో స‌ర‌సం ఆడిన ఆ మ‌హిళ‌.. న్యాయ‌వాది భార్య కాద‌ని తేలింది. ఆమె కూడా న్యాయ‌వాదేన‌ని తెలిసింది. ఈ కేసును సీబీసీఐడికి అప్ప‌గించాల‌ని చెన్నై హైకోర్టు ఆదేశించింది.

   

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.