అతడికి హెయిర్ కట్ చేస్తున్న సమంత.. వీడియో వైరల్..

  0
  778

  హెయిర్ కట్ చేస్తున్న సమంత.. వీడియో వైరల్..

  నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మరింత పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టింగ్ లు, ఆమె వెళ్తున్న టూర్ లు, ఆ టూర్లలో ఆమెతోపాటు ఉంటున్న వ్యక్తులు మరింత సంచలనానికి కారణం అవుతున్నారు. అసలు సమంత విడాకులకు కారణం అని అనుకుంటున్న ప్రీతమ్ జుకల్కర్ అనే స్టైలిష్ట్ కి సమంత హెయిర్ కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్యాప్ పెట్టుకుని ఉన్న జుకల్కర్ కు తమాషాగా సమంత హెయిర్ కట్ చేస్తున్నట్టు ఫోజులిచ్చింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో ఉంచింది. హెయిర్ కట్ చేసినందుకు నాకు నువ్వు బాకీ ఉన్నావ్ జుకల్కర్ అని అర్థం వచ్చేట్టు ఆ వీడియోకి కామెంట్ కూడా జత చేసింది సమంత. నాకు చాలా పనులు వచ్చు.. నేను మల్టీటాలెంటెడ్ అని కూడా సమంత పోస్ట్ చేసింది.

  జుకల్కర్ మళ్లీ ఒక్కసారిగా ఈ వీడియోతో లైమ్ లైట్లోకి వచ్చాడు. గతంలో సమంత విడాకుల సమయంలో ప్రీతమ్ పై పుకార్లు వచ్చాయి. ప్రీతమ్ వల్లే నాగచైతన్య, సమంత మధ్య వ్యవహారం విడాకుల వరకు వచ్చిందనే వార్తలొచ్చాయి. సమంత విడాకుల సమయంలో అయితే ఎక్కువగా ప్రీతమ్ ట్రెండింగ్ సబ్జెక్ట్ అయ్యాడు. ప్రీతమ్ వల్లే సమంత చైతన్యలు విడిపోయారంటూ రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. వాటిపై ప్రీతమ్ స్పందిస్తూ బాధపడ్డాడు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాగ చైతన్యకు తెలుసు.. ఇన్ని రకాల రూమర్లు వస్తున్నా కూడా చై ఖండించకపోవడం బాధగా ఉందంటూ ప్రీతమ్ ఎమోషనల్ అయ్యాడు. తాను సమంతను అక్కా అని సంబోధిస్తుంటానని చెప్పాడు. ప్రీతమ్ గే అంటూ కొందరు ట్రోలింగ్ చేశారు కూడా.

  అయితే ప్రీతమ్ ఇప్పుడు సమంతతోనే ఉన్నాడు. యశోద సినిమా షూటింగ్ విరామం దొరికినప్పుడు అందరూ కలిసి సరదాగా గడిపినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే ప్రీతమ్, సమంతకు స్టైలిష్ట్. కానీ సమంత ఇక్కడ హెయిర్ స్టైలిష్ట్‌గా మారింది. ప్రీతమ్ జుట్టును కట్ చేసింది. ఈ వీడియోతో మరోసారి సమంత, ప్రీతమ్ వార్తల్లో వ్యక్తులుగా మారారు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..