దారితప్పిన అందం.. మోసమే నేర్చింది..

  0
  64

  ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని.. అలా వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకొని.. మరింత మందితో ప్రేమాయణం సాగిస్తూ మగాళ్లను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మితాఖాన్ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మితాఖాన్ మంచి అందగత్తె.. సినిమా యాక్టర్లు కూడా మితాఖాన్ ముందు తీసికట్టే.. అలాంటి అందగత్తె బుద్దులు దారితప్పి.. టిండర్ యాప్ ద్వారా మగాళ్లకు టెండర్ వేస్తోంది. పరిచయం పెంచుకుంటుంది. ప్రేమ పేరుతో దగ్గరై.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళీ కొన్నాళ్ళకు విడిపోతుంది.

  మొదటి ఇద్దరు భర్తలను ఇలాగే వదిలేసింది. ఆ తర్వాత మూడవ భర్త ఆజం ఖాన్ ను 2019లో పెళ్లాడింది. కొద్దిరోజులకే ఆజం ఖాన్ కు భార్య ప్రవర్తనలో తేడా ఉందని అర్థమైంది. రేయింబవళ్లు ఆన్లైన్ లో మగాళ్లతో చాటింగ్ చేస్తూ గడుపుతూ ఉన్న భార్యను, అనుమానం వచ్చిన భర్త ఇదేమిటని ప్రశ్నించినా.. నిర్లక్ష్యంగానే ఉండేది. అయితే ఆమె అందానికి బానిసైన ఆజంఖాన్.. ఆమె ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ పట్టించుకునేవాడు కాదు. అయితే బరితెగించిన మితాఖాన్.. కొద్దిరోజులకే మరొక యువకుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుంది.

  ఇలా నిత్యం తనకళ్ల ముందే.. భార్య అనైతికంగా ప్రవర్తిస్తుండటంతో తట్టుకోలేని అజాంఖాన్, అన్ని ఆధారాలతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను తన భార్య మోసం చేస్తోందని కేసు పెట్టాడు. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మైసూర్ లోని ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..