ధనుష్ – ఐశ్వర్య..ఇక ఆశ లేదు..కథ సమాప్తం.

  0
  131

  కోలీవుడ్ హీరో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విడిపోతున్న‌ట్లు ఈఏడాది జ‌న‌వ‌రిలో ప్ర‌క‌టించ‌డం సెన్సేష‌న్ అయింది. కూతురిని, అల్లుడిని క‌లిపేందుకు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అది సాధ్యం కాలేదు. అయితే ఏదో ఒక‌రోజు వీరిద్ద‌రూ మ‌ళ్ళీ క‌లుస్తార‌నే అభిప్రాయం సినీ ల‌వ‌ర్స్ తో పాటు అంద‌రికీ ఉండేది.

  ట్విట్ట‌ర్ ఖాతాలో ఐశ్వ‌ర్య త‌న పేరు ప‌క్క‌న ధ‌నుష్ ను ఆమె తొల‌గించ‌లేదు. దీంతో మ‌ళ్ళీ క‌ల‌వ‌చ్చే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ధ‌నుష్ పేరును తొల‌గించిన ఐశ్వ‌ర్య .. త‌న పేరు ప‌క్క‌న తండ్రి పేరును చేర్చింది. దీంతో ఈ జోడీ మళ్లీ కలిసే అవ‌కాశం లేద‌నే క్లారిటీ ఇచ్చేసింది ఐష్‌.

  టాలీవుడ్ లో నాగ‌చైత‌న్య‌-స‌మంత డైవ‌ర్స్ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కొంత‌కాలం స‌మంత, త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో చైతూ పేరును ఉంచుకుంది. కొన్నాళ్ళ‌కు తొల‌గించి తండ్రి పేరు జోడిస్తూ స‌మంత రీతూ ప్ర‌భు అని పెట్టుకుంది. అదేవిధంగా ఐశ్వ‌ర్య కూడా ధ‌నుష్ పేరును తొల‌గించి త‌న తండ్రి ర‌జ‌నీకాంత్ పేరును జోడించింది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..