చైతన్యతో ముద్దు సీన్ పై సాయిపల్లవి క్లారిటీ .

  0
  202

  లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ముద్దు సీన్ ఉంటుంది. ఈ సీన్ పై అప్పట్లో చాలా పెద్ద దుమారం చెలరేగింది. ఈ సీన్ వల్లే సమంత, చైతన్యకు మధ్య దూరం పెరిగిందనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమా విడుదల సమయంలో సాయి పల్లవికి బెస్టాఫ్ లక్ చెప్పిన సమంత అలాంటి పుకార్లకు చెక్ పెట్టింది. తాజాగా ఆ ముద్దు సీన్ పై సాయి పల్లవి వివరణ ఇచ్చింది.

  ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని రొమాన్స్ సన్నివేశాలు, యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులోని కొన్ని సన్నివేశాలు, యాక్షన్ సీన్లు బాగా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే సాయి పల్లవి నాగచైతన్య కు నిజంగానే ముద్దు పెట్టిందా అనే విషయం బాగా వైరల్ గా మారింది. సాదారణంగా ఇలాంటి రొమాంటిక్ సీన్లకు సాయి పల్లవి దూరం. అలాంటి హీరోయిన్ చైతన్యతో రొమాన్స్ కి ఎందుకు ఓకే చెప్పిందని అందరూ భావించారు. అయితే ఈ విషయంపై సాయిపల్లవి పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. తాను నాగచైతన్యను కిస్ చేయలేదని చెప్పింది. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాలలో తాను నటించలేదని, శేఖర్ కమ్ముల కూడా తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది.. స్టోరీ ప్రకారం ఆ సన్నివేశం ఉండాలి కాబట్టి, కెమెరామెన్ ట్రిక్ తో ఆ సన్నివేశం చేశారని తెలిపింది. ఇకపై ఇలాంటి సన్నివేశాల్లో నటించనని తెలిపింది. అంతే కానీ తమ మధ్య ఏమీ లేదని చెప్పింది సాయి పల్లవి.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.