కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం..?

  0
  388

  కమల్ హాసన్ కరోనాతో పోరాడుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నా.. కమల్ కు సీరియస్ గా ఉందని ఆయన తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతున్నారని చెన్నైలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక వదంతులు ప్రచారంలోకి వచ్చాయి.

  ఇంతకీ కమల్ కి ఏమైంది..?
  ఇటీవల తాను వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని ఆయన స్వయంగా తెలిపారు. కమల్ హాసన్ చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చేరారు. జ్వరం తో పాటు శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో కమల్ హాసన్ తమ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారని, ఆయనకు వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుహాస్ ప్రభాకర్ తెలిపారు. కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులిటన్ లో వెల్లడించింది. కమల్ హాసన్ అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గుతో బాధపడుతున్నారు. చికాగో తో పాటు పరిసర నగరాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గోనేందుకు ఆయన నవంబర్ 15వ తేదీ విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత కరోనాబారిన పడ్డారు.

   

  తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నందున తానెవరినీ కలుసుకో దల్చుకో లేదని కమల్ తన సన్నిహితులకు ఫోన్ లో సమాచారం అందించారు. అయితే కమల్ ఆరోగ్య పరిస్థితిపై తమిళనాట పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

   

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.