సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ సిసి కెమెరా దృశ్యాలు..

  0
  844

  హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పై అతివేగం వల్లే జరిగిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం  కెమెరా దృశ్యాలు చూడండి.. అంత వేగంలో రోడ్డుమీద పడినప్పుడు వెనుకనుంచి వాహనం రాకపోవడంవల్లనే , సాయి ధరమ్ తేజ్ గాయాలతో బయటపడ్డాడు.. వెనుక ఏదైనా వాహనం ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది.. వీడియో చూడండి.. స్పీడ్ లో రోడ్డుపై మట్టి కారణంగా బైక్ స్కిడ్ అయింది. కంట్రోల్ చేయడం వీలుకాక జారిపోయి , అలాగే లాక్కుపోయింది… ఆయనకు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని , స్వల్పంగా ఇతరత్రా గాయాలు ఉన్నాయని అపోలో హాస్పిట డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుంది. పరిస్థితి నిలకడగా ఉందని , ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. మెగా స్టార్ చిరంజీవి కూడా , అభిమానులు ఆందోళన చెందవద్దని , సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి ప్రమాదం లేదని అన్నారు. ప్రమాదం వార్త తెలిసినవెంటనే పవన్ కళ్యాణ్ , అల్లు అరవింద్ హాస్పిటల్ కి వచ్చి డాక్టర్లతో మాట్లాడారు. మెడికవర్ నుంచి , అపోలోకి తరలించారు. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

   

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్