హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పై అతివేగం వల్లే హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని పోలీసులు చెప్పారు. ఆయనకు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని , స్వల్పంగా ఇతరత్రా గాయాలు ఉన్నాయని అపోలో హాస్పిట డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుంది. పరిస్థితి నిలకడగా ఉందని , ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. మెగా స్టార్ చిరంజీవి కూడా , అభిమానులు ఆందోళన చెందవద్దని , సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి ప్రమాదం లేదని అన్నారు. ప్రమాదం వార్త తెలిసినవెంటనే పవన్ కళ్యాణ్ , అల్లు అరవింద్ హాస్పిటల్ కి వచ్చి డాక్టర్లతో మాట్లాడారు. మెడికవర్ నుంచి , అపోలోకి తరలించారు. శుక్రవారం స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇవీ చదవండి..