ఆ బండి ఎక్కితే ఎవ్వరైనా తగ్గేదే లే..

  0
  3795

  మెగాస్టార్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి గురైన బండిని ఆయన ఇటీవలే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆయనకి చిన్నప్పటినుంచీ బైకులంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు ఖరీదైన బైక్‌ లపై హైదరాబాద్‌ లో చక్కర్లు కొట్టి వస్తుంటారు. హీరో అయిన తర్వాత హెల్మెట్ ధరించి తానెవరేనేది ఎవరికీ తెలియకుండా రైడ్ కి వెళ్లొస్తుంటారు సాయి తేజ్. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఆయనకు ఫైన్ కూడా వేశారు.

  ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్ ఇది. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్‌ ప్రత్యేకత. లగ్జరీ బైక్‌ లకు పేరుగాంచిన ట్రయాంప్‌ సంస్థ తయారు చేసింది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 16 షోరూమ్‌ లు మాత్రమే ఉన్నాయి.

  అయితే ట్రయంప్‌ కంపెనీకి చెందిన ఈ స్పోర్ట్స్‌ బైక్‌ను కొద్దిరోజుల క్రితమే హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్వయంగా హైదరాబాద్‌ లో లాంచ్ చేశారు.. అప్పుడే ఈ బైక్‌ పై మనసు పారేసుకున్నాడు. బైక్‌ పై కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు. అదే రోజు ఆ బైక్‌ ను కొనుగోలు చేసి వాడుతున్నాడు సాయి తేజ్. అప్పుడప్పుడు హైదరాబాద్‌ రోడ్లపై ట్రయంప్‌ బైక్‌ పై చక్కర్లు కొట్టేవాడు. ఇప్పుడు అదే బైక్‌ పై ప్రయాణిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనా ఇప్పటికే వైద్యులు వెల్లడించారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్