తన వీర్యాన్ని సిరంజీలో ఎక్కించి ఓ మహిళకు ఇంజెక్షన్ ఇచ్చిన కేసులో ఓ ఉన్మాదికి పదేళ్ళ జైలుశిక్ష పడింది. సూపర్ మార్కెట్‌లో షాపింగ్ కోసం ట్రాలీ తీస్తున్న ఆ మహిళపై థామస్ బైరన్ అనే ఉన్మాది ఇంజక్షన్ తో దాడి చేశాడు. ఆ తర్వాత పరిశీలిస్తే ఆ ఇంజక్షన్ లో తన వీర్యం కలిపి ఆమెకు ఇంజక్షన్ చేశానని చెప్పాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె నడుము భాగంలో ఈ ఇంజక్షన్ ఇచ్చే సమయంలో ఆమె అడ్డుకునేలోపే తన పని పూర్తి చేశాడు. గతంలో కూడా పలు దఫాలు ఇలాగే తన వీర్యాన్ని ఇంజక్షన్ లో నింపి మహిళలకు ఇచ్చే వాడని విచారణలో తేలింది. ఇలాంటి కేసుల్లోనే ఆరు దఫాలు జైలుకి వెళ్ళొచ్చాడు. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చినా, అతను తన ఉన్మాదాన్ని మానుకోకపోవడంతో బెయిల్ కి, పెరోల్ కి వీలు లేకుండా అమెరికాలోని మేరీల్యాండ్ కోర్టు అతనికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది.