పంది ఆకారంలో షార్క్ చేపలు.. వలలో పడ్డాయి..

  0
  410

  సముద్రం అంతులేని రహస్యాలకు, అద్భుతాలకు సాక్ష్యం. సాగర గర్భంలోని జీవజాలం 65శాతం ఇంతవరకు మనుషులు చూసింది కాదు. మనం చూసేది చాలా కొద్ది శాతం మాత్రమే. తాజాగా పంది ఆకారంలో ఉన్న షార్క్ చేప బయటపడి సంచలనం సృష్టిస్తోంది. ఇటలీకి చెందిన కొంతమంది మత్స్యకారులు సముద్రంలో వేటాడుతుంటే ఎల్బా అనే దీవి దగ్గర వలలో రెండు అతి పెద్ద షార్క్ చేపలు పడ్డాయి.

  వీటిని బయటకు తీసి చూస్తే, అవి పంది ఆకారంలో ఉన్నాయి. దీన్ని యాంగులర్ రఫ్ షార్క్ అంటారని సముద్ర గర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. సముద్రం అడుగు భాగంలో ఉండే ఈ పంది ఆకారంలోని షార్క్ చేప, సాధారణంగా పైకి రాదు. అయితే ఇటీవల వాతావరణంలో మార్పులు, సముద్ర అడుగు భాగంలో భూమి కదలికల్లో మార్పుల కారణంగా ఈ చేపలు అప్పుడప్పుడు పైకి వస్తున్నాయని సముద్ర జీవ శాస్త్రవేత్తలు నిర్థారించారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్