ఆ అమ్మాయికోసం సచిన్ ఏం చేశాడంటే..?

    0
    268

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. పేద రైతు కుమార్తె కలను నిజం చేయడానికి అండగా నిలబడి రియల్ హీరోగా నిలిచారు. పేద రైతు కుమార్తె డాక్టర్‌ అయ్యేంతవరకు అయ్యే ఖర్చులను భరించబోతున్నారు.
    మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా జైరే ప్రాంతానికి చెందిన దీప్తి విశ్వాస్ రావు నిరుపేద రైతు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఆయన కుమార్తె దీప్తి కి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక.. అదే కలలు కంటూ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది. మెరిట్ మార్కులతో పాస్ అవుతూ వచ్చింది. మంచి మార్కులను సొంతం చేసుకున్న దీప్తికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే దీప్తి ఫ్యామిలీ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో దీప్తి డాక్టర్ చదువు కోసం అయ్యే ఖర్చుని వారు భరించలేనంత భారంగా మారింది. దీప్తి గురించి సేవా సహ్యోగ్‌ అనే స్వచ్చంద సంస్థకు తెలిసింది. వెంటనే ఆ సంస్థ ఈ విషయాని దీప్తి సంకల్పం గురించి సచిన్‌ టెండూల్కర్ ఫౌండేషన్‌ ‘ఎస్‌ఆర్‌టీ10’ దృష్టికి తీసుకెళ్ళింది. వెంటనే ఆ సంస్థ స్పందించి దీప్తి భవిష్యత్ కు భరోసానిస్తూ.. డాక్టర్ చదువు అయ్యేవరకూ అయ్యే ఖర్చులను తాము భరిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?